చిన్నపిల్లల బుగ్గలు గిల్లడం నేరమా? ఓ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు దీనిపై స్పష్టత ఇచ్చింది. లైంగిక ఉద్దేశం లేకుండా చిన్నపిల్లల చెంపలు తాకడం నేరంగా పరిగణించలేమని తెలిపింది. జస్టిస్ సందీప్ శిందేతో కూడిన ఏక సభ్య ధర్మాసనం నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఆగస్టు 27న ఈ తీర్పునిచ్చింది.
" నా అభిప్రాయంలో లైంగిక ఉద్దేశం లేకుండా చెంపలు తాకడం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాదు. పోక్సో చట్టంలోని సెక్షన్ 7లో ఇదే ఉంది. నిందితుడు లైంగిక ఉద్దేశంలోనే చిన్నారి చెంపను తాకినట్లు రికార్డులోని ప్రాథమిక మూల్యంకనం సూచించడం లేదు" అని కోర్టు తెలిపింది.
అయితే తన పరిశీలనలు బెయిల్ పిటిషన్ల విచారణకు మాత్రమే వర్తిస్తాయని జస్టిస్ సందీప్ శిందే స్పష్టం చేశారు. ఇతర కేసుల విచారణను ఇది ఏమాత్రం ప్రభావితం చేయదని పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..