దేశంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 1951లో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల శాతం ఆరు రెట్లు ఎక్కువని ఈసీ తెలిపింది. సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 94,50,25,694 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా ఈ మొత్తం ఓటర్లలో సుమారు 31.50 కోట్ల మంది ఓటర్లు గత 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు ఈసీ చెప్పింది. వీరిలో ఎక్కువ శాతం మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు, యువతతో పాటు వలస వెళ్లిన వారే ఉన్నారని ఈసీ నివేదికలో పేర్కొంది.
1951 నుంచి 2019 వరకు ఓటింగ్ సరళి క్లుప్తంగా..
⦁ 1951లో మొదటిసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో కేవలం 45.67 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
⦁ 1957లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ సమయానికి 19.37 కోట్ల మంది ప్రజలు ఓటు వేసేందుకు అర్హులుగా ఉంటే అందులో కేవలం 47.74 శాతం మంది ఓటు వేశారు.