తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదు రోజుల్లో 7లక్షల మందికి కరోనా టీకా - ఎవరన్నా కరోనా టీకా వల్ల అస్వస్థకకు గురైయ్యారా?

దేశావ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ఐదోరోజుకు విజయవంతంగా పూర్తయింది. బుధవారం సాయంత్రం వరకు మొత్తం 7 లక్షలకు పైగా కరోనా యోధులకు టీకాలు అందించారు.

Total 7.86 lakh healthcare workers got COVID-19 vaccine jabs till Wednesday 6 pm says  Centre
7లక్షలకు పైగా మందికి కరోనా టీకా పంపిణీ పూర్తి

By

Published : Jan 20, 2021, 9:21 PM IST

దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ఐదో రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా ముగిసింది. మొదటి రోజు నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తంగా 7,86,842 ఆరోగ్య కార్యకర్తలు, కరోనా యోధులు టీకాలు వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఇవాళ ఒక్కరోజే 20 రాష్ట్రాల్లో 1,12,007 మందికి టీకా ఇచ్చినట్లు వెల్లడించింది.

టీకా వల్ల దేశవ్యాప్తంగా 10 మంది స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్​ అగ్నాని తెలిపారు. కొవిడ్​ టీకా వల్ల ఎవరికీ తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:భారతీయ టీకాలు మానవత్వానికి చిహ్నాలు: మోదీ

ABOUT THE AUTHOR

...view details