టూల్‌కిట్ వ్యవహారంలో పర్యావరణ కార్యకర్త దిశ రవిపై దాఖలైన ఎఫ్ఐఆర్కు సంబంధించిన దర్యాప్తు సమాచారం విషయంలో కొన్ని మీడియా సంస్ధలపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా మీడియా సంస్ధలు ప్రసారం చేసిన వార్తలు సంచలనాత్మకంగా, వాస్తవ విరుద్ధమైనవిగా ఉన్నాయని పేర్కొంది.
దర్యాప్తు సమాచారాన్ని మీడియాకు లీక్ కాకుండా చూడాలని దిశ రవి దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. దర్యాప్తుపై ప్రభావంపై చూపే అవకాశాలు ఉన్నందున లీకైన సమాచారాన్ని ప్రసారం చేయరాదని మీడియా సంస్ధలకు హైకోర్టు సూచించింది. మీడియా సంస్ధలకు దర్యాప్తు సమాచారాన్ని లీక్ చేయరాదని దిల్లీ పోలీసులను ఆదేశించింది. పోలీసులు.. మీడియా సంస్ధలకు లీక్ చేశారని భావిస్తున్న సమాచారం, పోలీసులు పోస్ట్ చేసిన ట్వీట్‌లను తొలగించేందుకు న్యాయస్ధానం నిరాకరించింది. దిల్లీ అన్నదాతల ఆందోళనకు సంబంధించిన టూల్‌కిట్ సమాచార వ్యాప్తి కేసులో దిశ రవిని ఈ నెల 13న అరెస్టు చేశారు.
ఇవీ చూడండి: