టూల్కిట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది, పర్యావరణ వేత్త నికితా జాకబ్ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. ఈ పిటిషన్.. అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ముందుకు మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది.
ముంబయికి చెందిన నికిత ఫిబ్రవరి 17న బాంబే హైకోర్టు నుంచి ట్రాన్సిట్ బెయిల్ పొందారు. దీనికి 3 వారాల గడువు ఉంది.