రైతు నిరసనలకు సంబంధించిన టూల్‌కిట్ కేసులో న్యాయవాది నిఖితా జాకబ్, ఇంజినీర్ శంతను ములుక్.. సోమవారం దిల్లీలో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ద్వారకాలోని దిల్లీ పోలీసు సైబర్ విభాగం కార్యాలయంలో వీరిని ప్రశ్నించినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
టూల్‌కిట్ కేసులో నికిత, శంతను విచారణ - రైతుల ఆందోళన నికితా జాకబ్
టూల్‌కిట్ కేసులో న్యాయవాది నికితా జాకబ్, ఇంజినీర్ శంతను ములుక్ను దిల్లీ సైబర్ విభాగం అధికారులు ప్రశ్నించారు. అంతకుముందు వీరిద్దరికీ న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
టూల్‌కిట్ కేసు: దిల్లీ సైబర్ విభాగం ఎదుట నికిత, శంతను
రైతులు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ఈ టూల్‌కిట్ డాక్యుమెంట్ కేసులో బెంగళూరుకు చెందిన దిశ రవిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు. ఈ కేసులో నికితా జాకబ్, శంతను ములుక్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి:బొగ్గు చౌర్యం కేసులో గంభీర్‌కు సీబీఐ ఉచ్చు!