టూల్‌కిట్ వ్యవహారంలో అరెస్టైన పర్యావరణ కార్యకర్త దిశా రవికి.. పటియాలా హౌస్ కోర్టు మూడు రోజుల కస్టడీ విధించింది. గణతంత్ర దినోత్సవం రోజు హింసకు దారితీసేందుకు కారణమైన టూల్‌కిట్‌ను రూపొందించారన్న ఆరోపణలతో దిశను దిల్లీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో గత వారం బెంగళూరులో అరెస్టైన దిశ.. కుట్ర, దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు దిల్లీ పోలీసులు.. తెలపగా కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
టూల్‌కిట్ కేసు: మూడు రోజుల కస్టడీకి దిశ రవి - దిశ రవి కస్టడీ
టూల్‌కిట్ కేసులో దిశ రవికి పటియాలా హౌస్ కోర్టు.. మూడు రోజుల కస్టడీ విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు పోలీసులు తెలపగా.. న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
మూడు రోజుల జ్యూడిషియల్ కస్టడీకి దిశ రవి
రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ ట్వీట్ చేస్తూ.. ఓ టూల్‌కిట్‌ను జోడించారు. జనవరి 26న రైతుల ఉద్యమానికి సంబంధించి ఓ కార్యాచరణను ఈ టూల్‌కిట్‌లో పొందుపర్చారనే ఆరోపణలతో దిశా రవి అరెస్టయ్యారు.
ఇదీ చదవండి:పర్యావరణం నుంచి 'దేశద్రోహం' వరకు.. ఎవరీ దిశ?