వ్యవసాయ రంగ అభివృద్ధితోనే స్వావలంబన, డిజిటల్ ఇండియా సాకారమవుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలీకరణ చేయడానికి గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సాగు రంగాన్ని అభివృద్ధి చేయడానికి నాలుగు ఇన్‌స్టిట్యూషన్స్‌తో ఏర్పరుచుకున్న అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు.
'వ్యవసాయ రంగ అభివృద్ధితోనే స్వావలంబన' - thomar on degitalisation of agriculture
స్వావలంబన, డిజిటల్ ఇండియా కల సాకారమవ్వాలంటే.. వ్యవసాయ రంగం అభివృద్ధితో మాత్రమే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. వ్యవసాయ రంగాన్ని డిజిటలీకరణ చేయడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వ్యవసాయంతోనే స్వావలంభన, డిజిటల్ ఇండియా సాకారమవుతాయన్న తోమర్
పతంజలి ఆర్గానిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అమెజాన్ వెబ్ సర్వీస్, ఈఎస్ఆర్ఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అగ్రి బజార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది వ్యవసాయ శాఖ. కిసాన్ డేటా బేస్‌ను ఆధార్‌లానే వినియోగించుకునేలా పైలెట్ ప్రాజెక్టుతో సహా నేషనల్ అగ్రికల్చర్ జియో హబ్ ఆవిష్కరణ, వ్యవసాయంలో డిజిటల్ సేవలపై ఒప్పందాలు జరిగాయి.
ఇదీ చదవండి:కాంగ్రెస్ కమిటీ ముందు సిద్ధూ హాజరు