తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐస్​క్రీమ్​ పుల్లలతో ఒలింపిక్స్ స్టేడియం.. చూసేయండి! - పూరీ ఒలింపిక్స్ మినియేచర్

ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి అద్భుత సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించాడు. 375 ఐస్​ క్రీమ్ పుల్లలతో ఒలింపిక్స్ స్టేడియం రూపకల్పన చేశాడు. దీన్ని చూసిన వారు అద్భుతం అంటూ మెచ్చుకుంటున్నారు.

ice sticks, miniature
ఒలింపిక్స్, మినియేచర్

By

Published : Jul 29, 2021, 4:40 PM IST

ఒలింపిక్స్ స్టేడియం మినియేచర్

ఒడిశాలోని పూరీకి చెందిన విశ్వజిత్ నాయక్ చేతులు అద్భుతాన్ని చేశాయి. ఐస్​క్రీమ్ పుల్లల సాయంతో టోక్యో ఒలింపిక్స్ స్టేడియం మినియేచర్​ను రూపొందించి వారెవ్వా అనిపించాడు. 375 ఐస్​ క్రీమ్ పుల్లలను ఉపయోగించి కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించడం విశేషం.

ఈ కళాఖండాన్ని ఒలింపిక్స్​​లో పాల్గొన్న భారత అథ్లెట్లకు అంకితం చేశాడు విశ్వజిత్. క్రీడల్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపాడు.

రథయాత్ర సమయంలోను విశ్వజిత్​.. జగన్నాథుని గజానన బేష రూపాన్ని తయారు చేశాడు. 1475 ఐస్​క్రీమ్ పుల్లలతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నాడు. ఈ కళాఖండం రూపకల్పనలకు పలువురి ప్రశంసలు పొందుతున్నాడు.

ఇదీ చదవండి:'జగన్నాథుడి'పై కళాకృతులు.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పం

ABOUT THE AUTHOR

...view details