తెలంగాణ

telangana

ETV Bharat / bharat

viral: రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు - టోహానా వార్త

హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో రెండు వర్గాలు రాళ్లతో భీకర ఘర్షణకు దిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పాత కక్షలే గొడవకు కారణమని అనుమానిస్తున్నారు.

tohana fight video viral
రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు

By

Published : Jun 7, 2021, 11:12 AM IST

Updated : Jun 8, 2021, 6:52 AM IST

రాళ్లతో ఘర్షణకు దిగిన రెండు వర్గాలు

హరియాణాలోని ఫతేహాబాద్​ జిల్లాలో రెండు వర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. జిల్లాలోని టోహానా పట్టణంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మొదట ఒక వర్గం వారు మరో వర్గం వాహనాలను కర్రలతో ధ్వంసం చేశారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లను విసురుకున్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్రంగా గాయలయ్యాయి. పాత కక్షలే ఈ గొడవకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Jun 8, 2021, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details