ఏడాదిన్నర పసికందు హత్యాచారానికి గురైన పాశవిక ఘటన ఉత్తర్ప్రదేశ్ బహ్రాయిచ్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని పట్టుకున్న గ్రామస్థులు.. పోలీసులకు అప్పగించారు.
అసలేమైందంటే..?
సోమవారం రాత్రి.. బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్న పసికందును ఓ వ్యక్తి ఎత్తికెళ్లి, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంలో అత్యాచారం చేశాడు. తెల్లవారుజామున లేచి చూసిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించపోయేసరికి.. ఆందోళనతో వెతికారు. ఈ క్రమంలో పాడుపడ్డ పాఠశాల భవనంలో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కనిపించింది. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తీవ్రమైన రక్తస్రావంతో మరుసటి రోజు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.