ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
గ్రహబలం..
- శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; శుక్లపక్షం దశమి: ఉ. 10.28
- తదుపరి ఏకాదశి పూర్వాషాఢ: ఉ. 6.50
- తదుపరి ఉత్తరాషాఢ తె.5.43
- తదుపరి శ్రవణం వర్జ్యం: మ. 2.27 నుంచి 3.59 వరకు అమృత ఘడియలు: రా.11.36 నుంచి 1.08 వరకు
- దుర్ముహూర్తం: ఉ. 9.54 నుంచి 10.43 వరకు తిరిగి మ.2.46 నుంచి 3.35 వరకు.
- రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం ఉ.5-51, సూర్యాస్తమయం: సా.6-01
మేషం..
సమయాన్ని అభివృద్ధి కోసం కేటాయించండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గా ధ్యానశ్లోకం చదవండి.
వృషభం..
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి,వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగించుకోవడానికి వేంకటేశ్వరుని పూజించాలి.
మిథునం..
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.
కర్కాటకం..
చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
సింహం..
పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.
కన్య..