మిశ్రమకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు పెరుగుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కనకధారాస్తవం చదవాలి.
మీ శ్రమ ఫలిస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.
శుభయోగాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మానసిక శక్తిని ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.
ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. శత్రువులతో జాగ్రత్త గా వ్యవహరించాలి. హనుమత్ ఆరాధన శుభకరం.
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలక వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.
ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.