తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (01-08-2022)

Horoscope Today (01-08-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే

By

Published : Aug 1, 2022, 4:05 AM IST

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహాసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. దుర్గ శ్లోకం చదవండి.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. మీరు ఊహించిన దానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

కీలక వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది

తలపెట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.

మధ్యమ ఫలితాలున్నాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. దుర్గ స్తోత్రం పఠించాలి.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీమీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.

మధ్యమ ఫలితాలున్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి.

మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్తితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధికమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details