తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే ? (29-07-2022) - today horoscope news

Horoscope Today (29-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే
ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే

By

Published : Jul 29, 2022, 4:50 AM IST

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శని ఆరాధన శుభప్రదం.

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దేహసౌఖ్యం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా అలోచించి ముందు సాగాలి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మి గణపతి దర్శనం శక్తిని ఇస్తుంది.

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్‌ చాలీసా చదవడం మంచిది.
.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శివఅష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

మంచిఫలితాలు పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. బంధు,మిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

ప్రారంభించిన పనుల్లో జాప్యం వద్దు. వృత్తి,ఉద్యోగ రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. చంద్ర ధ్యాన శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య విషయాల్లో బద్ధకించకండి. ఆరోగ్యం జాగ్రత్త. దుర్గాఆరాధన శుభప్రదం.

కాలం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మనఃస్సౌఖ్యం ఉంది. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ మంచిది.

వృత్తి,ఉద్యోగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details