తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Today Horoscope
ఈ రోజు రాశిఫలాలు

By

Published : Jun 10, 2021, 4:12 AM IST

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

మేషం :

చేపట్టిన పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తారు. కాలం శుభప్రదంగా ఉంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.

వృషభం:

కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. మొదలుపెట్టిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.

మిథునం:

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతనంగా చేపట్టే పనులను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటకం:

తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివారాధన శుభప్రదం.

సింహం:

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

కన్య:

మొదలు పెట్టిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.

తుల:

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. కలహాలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక మాట విలువను కాపాడుకోవాలి. హనుమ ఆరాధన శుభప్రదం.

వృశ్చికం:

ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసరంగా గొడవల్లో చిక్కుకునే అవకాశం ఉంది కనుక అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. కుటుంబ సభ్యుల తోడు ఉంటుంది. లక్ష్మీదేవి నామ స్మరణ మంచిది.

ధనుస్సు:

ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. మనోధైర్యం రక్షిస్తుంది. దుర్గాదేవిని, వేంకటేశ్వరుడిని పూజిస్తే శుభం జరుగుతుంది.

మకరం:

ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

కుంభం:

చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. దైవబలంతో ఆటంకాలను ఎదుర్కొంటారు. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. శని జపం అనుకూలతనిస్తుంది.

మీనం:

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాల్లో పెద్దలు లేదా అధికారుల మెప్పును పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ABOUT THE AUTHOR

...view details