తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే!

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Today Horoscope
ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే!

By

Published : Jun 5, 2021, 5:35 AM IST

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. ఆదిత్య హృదయం చదవాలి.

ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. అనవసర కలహాలకు అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు. గొడవలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే మంచి జరుగుతుంది.

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలు సొంతం చేసుకుంటారు. నిర్ణయాలు మార్చడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు ఇబ్బందులు కలిగిస్తాయి. మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. గణపతి స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారా స్తోత్రం చదివితే బాగుంటుంది.

ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈశ్వర ధ్యాన శ్లోకాన్ని చదివితే మేలు జరుగుతుంది.

మొదలు పెట్టిన పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం.

కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కీలక సమయంలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఇష్టదేవతను సందర్శిస్తే మంచిది.

అధికారుల సహకారం ఉంటుంది. తప్పుదోవ పట్టించేవారున్నారు కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. పెద్దల సహకారం అందుతుంది. దుర్గ ధ్యానం శుభప్రదం.

తలపెట్టిన పనులు శీఘ్ర విజయాన్నిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అర్థికంగా లాభం పొందుతారు. తోటివారి సహకారం లభిస్తుంది. లింగాష్టకం చదవాలి.

ABOUT THE AUTHOR

...view details