తెలంగాణ

telangana

ETV Bharat / bharat

September 12 Horoscope: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశి ఫలాలు 2021

ఈ రోజు రాశిఫలం (Horoscope today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే...

today horoscpoe
నేటి రాశిఫలం

By

Published : Sep 12, 2021, 9:28 AM IST

పన్నెండు రాశుల (Horoscope today) వారికి నేడు ఎలా ఉండనుందో డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ వివరించారు. ఆ సంగతులు మీకోసం..

మేషం

ముఖ్య విషయాల్లో ఆత్మస్థైర్యం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

వృషభం

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వరుని దర్శనం శుభప్రదం.

మిథునం

చక్కటి శుభకాలం నడుస్తోంది. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే ఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

కర్కాటకం

అనుకూలమైన సమయం. మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. సూర్య నమస్కారాలు చేయడం మంచిది.

సింహం

శుభకాలం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి ధ్యానం శుభప్రదం.

కన్య

ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. లక్ష్మీ గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

తుల

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

వృశ్చికం

లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ ఫలితాలను ఇస్తుంది.

ధనస్సు

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

మకరం

అనుకున్నపని నెరవేరుతుంది. సంతోషంగా గడుపుతారు. విందు,వినోద సుఖాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

కుంభం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్యహృదయం పఠించాలి.

మీనం

శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

ఇదీ చదవండి:ఈ వారం రాశిఫలం (సెప్టెంబరు 12 - 18)

ABOUT THE AUTHOR

...view details