తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 8 Horoscope: నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - thursday horoscope

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : Jul 8, 2021, 5:09 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

సత్ఫలితాలను అందుకుంటారు. కొన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలి. అస్థిర బుద్ధితో వ్యవహరించి అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలు నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

వృషభం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

మిథునం

మీ కృషి ఫలిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. తోటివారి సహకారంతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. లలితాదేవిని స్మరించాలి.

కర్కాటకం

అనుకున్నది సాధిస్తారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.

సింహం

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. అధికారుల అనుగ్రహం పొందడానికి బాగా కష్టపడాల్సివస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

కన్య

అభివృద్ధికై మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో సంతోషముగా గడుపుతారు. శివారాధన మంచినిస్తుంది.

తుల

చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అనవసరంగా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. కనకధారాస్తవాన్ని పఠిస్తే మంచిది.

వృశ్చికం

విశేషమైన శుభఫలితాలున్నాయి. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. అవసరమైన వాటిపై దృష్టిసారించండి. ఇష్ట దైవారాధన శుభం.

ధనుస్సు

అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శిస్తే మంచిది.

మకరం

శ్రమ అధికమవుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కుంభం

అభివృద్ధికి సంబంధించి ముందడుగు వేస్తారు. ధనయోగం ఉన్నది. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్య వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఇష్ట దైవారాధన శుభప్రదం.

మీనం

శుభకాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. శ్రీ హయగ్రీవ స్తోత్రం చదివితే మంచిది.

ABOUT THE AUTHOR

...view details