తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 4 Horoscope: ఈ రోజు రాశి ఫలం - ఈరోజు రాశి ఫలాలు

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Today Horoscope
నేటి రాశిఫలాలు

By

Published : Jul 4, 2021, 4:16 AM IST

Updated : Jul 4, 2021, 6:58 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

ఆశావాద దృక్పథంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ఇబ్బందులు తొలగుతాయి. శివారాధన శుభప్రదం.

వృషభం

మీ మీ రంగాల్లో మీ శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గణపతిని పూజిస్తే మంచిది.

మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దైవారాధన మానవద్దు.

కర్కాటకం

అనుకున్నది సాధిస్తారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత ఉంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సూర్యారాధన చేస్తే మంచిది.

సింహం

మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

కన్య

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన మంచిది.

తుల

చేపట్టబోయే పనులకు విఘ్నాలు ఎదురవుతాయి. పనుల్లో దేహజాఢ్యాన్ని రానివ్వకండి. చంచలబుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

ధనుస్సు

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

మకరం

అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. ఇష్టదైవారాధన మంచిది.

కుంభం

శుభకాలం. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శని ధ్యానం చేయాలి.

మీనం

ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూలమైన, మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. నూతన వస్తువులు కొంటారు. విందు,వినోదాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం శుభప్రదం.

Last Updated : Jul 4, 2021, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details