Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజే.. 2,58,089 లక్షల కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:3,73,80,253
- మొత్తం మరణాలు:4,86,451
- యాక్టివ్ కేసులు:16,56,341
- మొత్తం కోలుకున్నవారు:3,52,37,461
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 39,46,348 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,57,20,41,825 కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 19,39,895 మందికి కరోనా సోకింది. 3,990 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,86,75,541కు చేరగా.. మరణాలు 55,57,594కు పెరిగింది.
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,87,973మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 346 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.6 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2,78,129 కేసులు వెలుగుచూశాయి. మరో 98 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో మరో 70,924 మంది వైరస్ బారిన పడ్డారు. 88 మంది మృతి చెందారు.
- ఇటలీలో 1,49,512 కొత్త కేసులు బయటపడగా.. 248 మంది మరణించారు.
- టర్కీలో 54,100 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 136 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:కర్ణాటకలో భారీగా కరోనా కేసులు.. మహారాష్ట్రలో తగ్గుముఖం