Covid Cases In India: భారత్లో రోజువారీ కొవిడ్ కేసులు స్థిరంగా నమోదవుతున్నా. కొత్తగా 2,075 మందికి వైరస్ సోకింది. మరణాలు శుక్రవారంతో పోల్చితే సగానికి పైగా తగ్గాయి. కొత్తగా మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,383 మంది వైరస్ను జయించారు. రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 0.56 శాతంగా ఉంది.
- మొత్తం మరణాలు: 5,16,352
- యాక్టివ్ కేసులు: 27,802
- కోలుకున్నవారు: 4,24,61,926
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. శుక్రవారం మరో 5,84,177 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,04,96,924 కు పెరిగింది.