భారత్లో కరోనా విజృంభణ దృష్ట్యా అమెరికా తన ఉదారతను చాటుతోంది. భారత్కు లక్షా 25వేల రెమిడెసివిర్ వయల్స్ ను పంపించి.. క్లిష్టపరిస్థితుల్లో ఆపన్నహస్తం అందిస్తోంది. అంతకుముందు.. వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఇతర వైద్య పరికరాలను అగ్రరాజ్యం భారత్కు పంపించింది.
అమెరికా నుంచి 1.25లక్షల రెమిడెసివిర్ వయల్స్ - remidesivir help from america
కరోనాతో ధైర్యంగా పోరాడుతున్న భారత్కు అమెరికా ఆపన్నహస్తం అందిస్తోంది. భారత్కు లక్షా 25వేల రెమిడెసివిర్ వయల్స్ పంపించి తన ఉదారతను చాటుకుంది. మూడు ప్రత్యేక విమానాల్లో దిల్లీకి చేరుకున్నాయి.
రెమిడెసివిర్
ఈ సందర్భంగా అమెరికా అందిస్తున్న గొప్ప సహకారానికి కృతజ్ఞత తెలిపింది భారత విదేశాంగ శాఖ.
ఇదీ చదవండి :'భారత్లో వైరస్ కట్టడికి లాక్డౌన్ ఉత్తమం'