తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకేపై మండిపడ్డారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే.. భాజపాకు దూరంగా ఉండేదని అయితే ప్రస్తుతం ఆ పార్టీ నరేంద్ర మోదీకి బానిసగా మారిందని ఆరోపించారు. చెన్నైలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేపైనా ఓవైసీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నించారు.
ఏఐఏడీఎంకే ఇక ఎంత మాత్రం మేడం జయలిలత పార్టీ కాదు. ఆమె తన పార్టీని భాజపాకు దూరంగా ఉంచేవారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి తొత్తుగా మారింది.
-అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధినేత.