తమిళనాడులో లాక్డౌన్ అమలుకు ముందు రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 854 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దుకాణాల్లో శనివారం రూ.426 కోట్లు, ఆదివారం రూ.428.69 కోట్లు మేర విక్రయాలు జరిగాయి.
రెండు రోజుల్లో రూ.854 కోట్ల మద్యం అమ్మకం - తమిళనాడులో మద్యం అమ్మకాలు
తమిళనాడులో లాక్డౌన్ అమలు నేపథ్యంలో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లోనే ఏకంగా రూ.854కోట్ల మద్యం కొనుగోలు చేశారు.
![రెండు రోజుల్లో రూ.854 కోట్ల మద్యం అమ్మకం tamilnadu liquor sales, tamilnadu lockdown liquor sales](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11706342-819-11706342-1620636977345.jpg)
తమిళనాడులో జోరుగా మద్యం విక్రయం
సోమవారం ఉదయం 4 గంటల నుంచి తమిళనాడులో లాక్డౌన్ అమలులోకి వచ్చింది. మరో రెండు వారాల పాటు మద్యం దుకాణాలు మూతపడి ఉంటాయి.
ఇదీ చదవండి :అసోం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణస్వీకారం