అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. సహకార బ్యాంకుల్లోని రూ.12,110 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పారు.
రైతులకు శుభవార్త చెప్పిన సీఎం - రైతురుణాలు మాఫీ
తమిళనాడు శాసనసభ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర సీఎం రైతులకు తీపి కబురు చెప్పారు. రూ. 12,110 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.
రైతులకు శుభవార్త చెప్పిన సీఎం
దీనివల్ల 16.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పళనిస్వామి తెెలిపారు. కాగా తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలని నేరువేరుస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. అయితే ప్రతిపక్ష డీఎంకే పై విమర్శలు గుప్పించారు. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 2 ఎకరాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఇదీ చూడండి:రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: తోమర్