తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ అభ్యర్థి మృతి.. గెలిస్తే ఉపఎన్నిక! - ఎన్నికల పోలింగ్

తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవరావు కరోనాతో మృతి చెందారు. గత నెలలో కరోనా వైరస్‌ బారిన పడిన మాధవరావు.. తాజాగా మళ్లీ ఆ వ్యాధి సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి తుదిశ్వాస విడిచారు.

TN Congress Candidate Madhava Rao
తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవరావు

By

Published : Apr 11, 2021, 3:07 PM IST

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి వారం రోజులు కూడా గడవకముందే విషాదం చోటుచేసుకుంది. శ్రీవిల్లిపుత్తూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి మాధవరావు మరణించారు. గత నెలలో కరోనా వైరస్‌ బారిన పడిన మాధవరావు.. తాజాగా మళ్లీ ఆ వ్యాధి సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పార్టీ తమిళనాడు ఇన్‌ఛార్జి సంజయ్‌ దత్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

కాంగ్రెస్​ పార్టీ తమిళనాడు ఇన్‌ఛార్జి సంజయ్‌దత్ ట్వీట్​

"కాంగ్రెస్‌ నాయకుడు, శ్రీవిల్లిపుత్తూర్‌ పార్టీ అభ్యర్థి మాధవరావు మరణించడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా."

-సంజయ్‌దత్,‌ కాంగ్రెస్ తమిళనాడు ఇన్‌ఛార్జి

తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్‌ 6వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీవిల్లిపుత్తూర్‌లో ఒకవేళ మాధవరావు విజయం సాధిస్తే ఉపఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి:'తరతరాల అవినీతికి కాంగ్రెస్, డీఎంకే నిదర్శనం'

ABOUT THE AUTHOR

...view details