తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2021, 11:23 AM IST

Updated : Jul 9, 2021, 3:13 PM IST

ETV Bharat / bharat

నవదంపతులను సర్​ప్రైజ్​ చేసిన సీఎం

వివాహ వేడుకకు స్థానిక నేతలు హాజరైతేనే ఎంతో గొప్పగా భావిస్తాం. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరైతే.. ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవమే తమిళనాడు తిరువరూర్​ జిల్లాలో ఓ జంటకు ఎదురైంది.

CM Stalin
సీఎం స్టాలిన్​

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆకస్మిక తనిఖీలతో అధికారులకు షాకిస్తుంటారు. అలాగే ప్రజలతో మమేకమై వారి బాధలను తెలుసుకుంటుంటారు. ఇటీవల సీఎం కార్యాలయానికి వెళ్తూ తన కాన్వాయ్​ని రహదారిపైనే ఆపి.. ఓ వృద్ధురాలి వద్ద దరఖాస్తు తీసుకుని అందరి మనసులు దోచుకున్నారు. తాజాగా రోడ్డుపైనే నవదంపతులను ఆశీర్వదించి.. వారిని ఆశ్చర్యపరిచారు. ఆయనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​.

నవదంపతులను ఆశీర్వదిస్తున్న సీఎం

ఈ సంఘటన స్టాలిన్​ సొంత జిల్లా తిరువరూర్​లో​ జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న స్టాలిన్​.. దారిలో ఓ ఫంక్షన్​ హాల్​ బయట పెళ్లి బట్టల్లో ఉన్న వధూవరులు.. రామ, రాజమణిలను గమనించారు. వెంటనే కారు ఆపి.. వారి వద్దకు వెళ్లి ఆశీర్వదించారు. వారు ఊహించని విధంగా సీఎం రాకతో కొత్త జంట ఒక్కసారి సంభ్రమాశ్చర్యానికి గురైంది.

ఇదీ చూడండి:సీఎం సైకిల్​పై వచ్చి సర్​ప్రైజ్​ చేస్తే...

Last Updated : Jul 9, 2021, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details