తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాజీవ్ హత్య కేసు దోషులను విడుదల చేయండి' - రాజీవ్ హత్య కేసు దోషుల విడుదలపై స్టాలిన్ లేఖ

రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయాలని కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఈ మేరకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు లేఖ రాశారు.

stalin letter
స్టాలిన్, తమిళనాడు సీఎం

By

Published : May 21, 2021, 5:00 AM IST

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఏడుగురు దోషులను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవిస్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశారు.

స్టాలిన్​ లేఖ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు నళిని, ఆమె భర్త మురుగన్ ఎల్​టీటీఈ ఉగ్రవాదులతో కలిసి వ్యూహరచన చేశారు. ఈ కేసుకు సంబంధించి నళిని, మురుగన్ సహా ఏడుగురు దోషులుగా తేలారు. నళినికి తొలుత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2000 సంవత్సరంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చింది.

ఏడుగురు దోషులను విడుదల చేయాలంటూ డీఎంకే సహా ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కూడా కోరుతోంది.

ఇదీ చదవండి:ఉచిత టీకా కోసం మోదీకి మాజీ ఐఏ​ఎస్​ల లేఖ

ABOUT THE AUTHOR

...view details