తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం - Tamillnadu Chopper Crash

Varun Singh Captain: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​.. భౌతిక కాయం భోపాల్​లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. అంతకుముందు విమానాశ్రయంలో ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు ఐఏఎఫ్​ అధికారులు, మధ్యప్రదేశ్​ మంత్రులు. వరుణ్​ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి సాయం ప్రకటించింది.

Mortal remains of Group Captain Varun Singh brought to Bhopal
Mortal remains of Group Captain Varun Singh brought to Bhopal

By

Published : Dec 16, 2021, 5:21 PM IST

Varun Singh Captain: హెలికాప్టర్​ ప్రమాదంలో గాయపడి బుధవారం మరణించిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ భౌతిక కాయం ఆయన స్వరాష్ట్రం మధ్యప్రదేశ్​కు చేరుకుంది. భోపాల్​ విమానాశ్రయంలో.. ఆయన మృతదేహం ముందు పుష్పాంజలి ఘటించారు ఐఏఎఫ్​ అధికారులు, రాష్ట్ర మంత్రులు. వరుణ్​ సింగ్​ సేవలను స్మరించుకున్నారు. అనంతరం.. పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు.

వరుణ్​ భౌతిక కాయం ముందు రోదిస్తున్న కుటుంబ సభ్యులు

గురువారం ఉదయం బెంగళూరులోని యెలహంక ఎయిర్​ఫోర్స్​ బేస్​లో ఐఏఎఫ్​ ఉన్నతాధికారులు, సైనికులు వరుణ్​ సింగ్​ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం భోపాల్​కు తీసుకెళ్లారు.

ఐఏఎఫ్​ ఉన్నతాధికారుల పుష్పాంజలి

రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి సాయం, ఉద్యోగం..

మరణానంతరం వరుణ్​ సింగ్​కు గౌరవం కల్పించనుంది మధ్యప్రదేశ్​ ప్రభుత్వం. ఏదైనా ఒక సంస్థకు ఆయన పేరు పెడతామని లేదా ఆయన విగ్రహం నిర్మిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​ స్పష్టం చేశారు. ఏం చేయాలో వరుణ్​ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు.

గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ కుటుంబానికి రూ. కోటి సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ సహా సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు చౌహాన్​ స్పష్టం చేశారు.

Tamilnadu Chopper Crash: ఈ నెల 8న తమిళనాడు నీలగరి జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్​ క్రాష్​ అయ్యింది. ఈ ఘటనలో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులతో పాటు 13 మంది అక్కడికక్కడే మరణించారు.

80 శాతాలతో కాలినగాయాలతో బయటపడిన వరుణ్​ సింగ్​కు తొలుత వెల్లింగ్టన్​ ఆర్మీ ఆస్పత్రిలో, ఆ తర్వాత బెంగళూరు మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 8 రోజులు మృత్యువుతో పోరాడి ఈ నెల 15న కన్నుమూశారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ, భారత వాయుసేన సహా పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటించారు.

ధైర్యసాహసాలకు శౌర్య చక్ర..

వరుణ్​ సింగ్​ తండ్రి.. ఏఏడీ(ఆర్మీ ఎయిర్​ డిఫెన్స్​)లో విధులు నిర్వహించారు. వరుణ్​ సోదరుడు తనూజ్​.. ప్రస్తుతం నేవీలో లెఫ్టినెంట్​ కమాండర్​.

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజీపుర్​కు చెందిన వరుణ్​ ఇప్పటికే ఓసారి మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్​లో.. ఆయన నడుపుతున్న తేజస్​ విమానంలో.. గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో వరుణ్​.. విమానం నుంచి దూకేందుకు ఆస్కారం ఉంది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్​ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది

ఇవీ చూడండి: చాపర్​ క్రాష్​కు ముందు ఏం జరిగింది? వీడియో తీసినవారి మాటల్లో..

Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​

ABOUT THE AUTHOR

...view details