Fare-Free Travel: తమిళనాడు ప్రభుత్వం ఐదేళ్లలోపు చిన్నారులకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రవాణా సంస్థలు నడిపే అన్ని రకాల బస్సుల్లో వారికి ఉచితంగా ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా మంత్రి ఎస్ఎస్ శివశంకర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు.
ప్రస్తుతం 3 నుంచి 12 ఏళ్ల వయసు గల చిన్నారులకు సగం ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇక, ఆదాయాన్ని పెంచుకునేందుకు సుదూరం ప్రయాణించే బస్సుల్లో లగేజీ కోసం కేటాయించిన ఖాళీ స్థలంలో కొంత భాగాన్ని పార్సిల్, కొరియర్ సేవల కోసం వినియోగించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆ వయసు వారికే! - చిన్నారులకు ఉచిత ప్రయాణం
Fare-Free Travel: ఇప్పటివరకు చిన్నారులు బస్సుల్లో ప్రయాణిస్తే వారికి సగం ఛార్జీ వసూలు చేసేవారు. అయితే ఇకపై ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించనున్నట్లు తమిళనాడు సర్కారు ప్రకటించింది.
fare-free travel for children