తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2021, 4:23 PM IST

ETV Bharat / bharat

'టీఎంసీ రాజకీయాలతో దేశ భద్రతకే ముప్పు'

బంగాల్​ మాల్దా జిల్లాలో పర్యటించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం తాపత్రయపడే తృణమూల్​ పార్టీ తీరు వల్ల దేశ భద్రతకే ముప్పు ఉందని ఆరోపించారు. బంగాల్​లో విజయం భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు.

Yogi adithyanath in WB
'దీదీ ప్రభుత్వం వల్ల దేశ భద్రతకే ముప్పు'

ఓట్ల కోసం అక్రమ వలసదారులను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నారని మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎన్నికల నేపథ్యంలో బంగాల్​ మాల్దా జిల్లాలో ఓ ర్యాలీకి హాజరైన యూపీ సీఎం... టీఎంసీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ నిర్ణయాల వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో దుర్గా పూజ నిషేధించారని, ఈద్​ సమయంలో గోవధ జరిగిందని ఆదిత్యనాథ్ అన్నారు. ఇన్ని జరుగుతున్నా మమత సర్కారు మౌనం వహిస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుతం 'జై శ్రీరామ్​' అనే నినాదమే లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

"ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలోని రామ భక్తులపై విద్వేషపూరితంగా ప్రవర్తించిన నాటి ప్రభుత్వానికి తలెత్తిన పరిస్థితే... బంగాల్​లో దీదీ ప్రభుత్వానికి వస్తుంది" అని వ్యాఖ్యానించారు యోగి. యూపీలో అమలు చేసిన లవ్​ జిహాద్ చట్టాన్ని​ బంగాల్​లోనూ తెస్తామని పేర్కొన్నారు. లవ్​ జిహాద్​, గోవధను అదుపు చేయడంలో బంగాల్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

ఇదీ చదవండి:కేరళను మళ్లీ పట్టేస్తారా? బంగాల్​లో పోటీ ఇస్తారా?

ABOUT THE AUTHOR

...view details