బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం-ఐఎస్ఎఫ్ కూటమి శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో అధికార టీఎంసీ కార్యకర్త మృతి చెందాడు. ఈ ఘటన దక్షిణ 24పరగణాల జిల్లాలో గురువారం జరిగింది.
మధ్యబెలగాచీ గ్రామంలో తమ పార్టీ అభ్యర్థి బివాశ్ సర్ధార్( బరైపుర్ పుర్బా అసెంబ్లీ నియోజక వర్గం) తరఫున టీఎంసీ కార్యకర్తలు ప్రచారం చేస్తుండగా... సీపీఎం-ఐఎస్ఎఫ్ శ్రేణులతో ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో 60ఏళ్ల రుహుల్ అమిన్ మిద్యే అనే తృణమూల్ కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.