కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా బంగాల్లో జరగనున్న 6, 7,8 దశల అసెంబ్లీ ఎన్నికలను కలిపి.. ఓకేసారి నిర్వహించాలని కోరుతూ బంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తృణమూల్ కాంగ్రెస్ వినతిపత్రాన్ని అందించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూడు దశలను కలిపి ఒకేసారి నిర్వహించాలని ఏప్రిల్ 15న ఈసీని సీఎం మమతా బెనర్జీ కోరారని తృణమూల్ నేత సుకేందు శేఖర్ రాయ్ తెలిపారు. సోమవారం కూడా తాము ఈసీకి విన్నవించామన్నారు.
పోలింగ్ కుదించాలని కోరుతూ ఈసీకి వినతిపత్రం
కరోనా విజృంభణ దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ను కుదించాలని బంగాల్ ఎన్నికల కమిషన్కు తృణమూల్ కాంగ్రెస్ వినతిపత్రాన్ని సమర్పించింది. సోమవారం.. బంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం.. 6,7,8 దశల ఎన్నికలను ఒకే దశకు కుదించాలని ఈసీని కోరారు.
మమతా బెనర్జీ
ఆ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఇప్పటికే ఐదు విడతల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 114 సీట్లకు మూడు దశల్లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి :'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్ కుదించండి'