బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రి అంకుల్ అంటూ సంబోధించారు. తన కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను రాజ్ భవన్‌లో ప్రత్యేక విధుల్లో (ఓఎస్‌డీ) అధికారులుగా నియమించారని ఆరోపించారు. ఈ మేరకు పలు పేర్లతో కూడిన జాబితాను ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు.
అబ్బుదోయ్ సింగ్ సేఖావత్ (ఓఎస్‌డీ-గవర్నర్), అఖిల్ చౌదరి(కో-ఆర్డినేషన్), రుచి దుబే(పరిపాలన), ప్రశాంత్ దీక్షిత్(ప్రోటోకాల్), కౌస్తవ్ ఎస్ వాలికర్(ఐటీ), కిషన్ ధంకర్ వంటి అధికారులు రాజ్భవన్లో ఓఎస్డీలుగా నియమితులయ్యారని.. వీరిలో షెఖావత్ జగ్దీప్ ధన్‌ఖర్ బావ కుమారుడని, రుచి దూబే, ప్రశాంత్ దీక్షిత్ అతని మాజీ సహాయకుడు మేజర్ గోరాంగ్ దీక్షిత్ భార్య సోదరుడని మహువా మొయిత్రీ తెలిపారు. వాలికర్ జనార్ధన్ రావుకు బావ అని.. కిషన్ ధన్‌కర్ గవర్నర్కు దగ్గరి బంధువు అని మొయిత్రా ఆరోపించారు.
గవర్నర్ను ప్రశ్నించేందుకు ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉందని మొయిత్రీ తెలిపారు.
"గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. అయితే.. తమను తాము అద్దంలో చూసుకోమని వారిని కోరుతున్నాను. ఆయన తన గ్రామం మొత్తాన్ని రాజ్ భవన్లోకి తీసుకువచ్చారు."
-మహువా మొయిత్రీ, టీఎంసీ ఎంపీ