తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​కు టీఎంసీ ఝలక్​- విపక్షాల భేటీకి దూరం - tmc congress

parliament winter session: పార్లమెంట్​ శీతాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి షాక్​ ఇచ్చింది తృణమూల్​ కాంగ్రెస్(trinamool congress)​. ఆ పార్టీ సమన్వయంతో నడిచేందుకు నిరాశక్తత వ్యక్తం చేసింది. ఈనెల 29న కాంగ్రెస్​ తలపెట్టిన ప్రతిపక్షాల (opposition parties meet) సమావేశానికి హాజరుకావటం లేదని స్పష్టం చేసింది.

TMC
కాంగ్రెస్​కు టీఎంసీ ఝలక్

By

Published : Nov 27, 2021, 4:35 PM IST

parliament winter session: పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్​కు ఝలక్​ ఇచ్చింది తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ(tmc on congress). ఈ సమావేశాల్లో కాంగ్రెస్​తో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా లేమని(tmc congress) ప్రకటించింది. అయితే, వివిధ అంశాలపై ఇతర విపక్షాలకు సహకరిస్తామని స్పష్టం చేశారు టీఎంసీ సీనియర్​ నేత ఒకరు. నవంబర్​ 29న కాంగ్రెస్​ నేత మల్లికార్జున్​ ఖర్గే పిలుపునిచ్చిన విపక్షాల సమావేశానికి(opposition parties meet) తమ పార్టీ హాజరవటం లేదని తెలిపారు.

కాంగ్రెస్​, టీఎంసీల(trinamool congress) మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో అంతర్గతంగా నేతల మధ్య సమన్వయం చేస్తూ ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని ఎద్దేవా చేశారు టీఎంసీ నేత.

" శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్​ పార్టీతో కలిసి నడిచే ఆలోచన లేదు. కాంగ్రెస్​ నేతలు ముందు వారి మధ్య సమన్వయాన్ని పెంచుకోవాలి. సొంత ఇంటిని ముందు చక్కదిద్దుకోవాలి. ఆ తర్వాత ఇతర పార్టీలతో దోస్తీ కోసం ప్రయత్నించాలి. ప్రజాప్రయోజనాల కోసం వివిధ అంశాలను లేవనెత్తుతూ.. ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతాం. "

- టీఎంసీ సీనియర్​ నేత

భాజపాపై పోరాటానికి కాంగ్రెస్​తో కలిసేందుకు ఇష్టపడకపోవటంపై ప్రశ్నించగా.. ఆ పార్టీ నేతల్లోనే సరైన అవగాహన, లక్ష్యం లేదని ఎద్దేవా చేశారు టీఎంసీ నేత(trinamool congress). నవంబర్​ 29న బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(mamata banerjee news) ఇంట్లో జాతీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. ' సాగు చట్టాల రద్దు(Farm laws repeal), కనీస మద్దతు ధర కల్పించే చట్టం, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపు, బీఎస్​ఎఫ్​ పరిధి పెంపు, ఫెడరల్​ వ్యవస్థను నిర్వీర్యం చేయటం, చమురు ధరల పెరుగుదల, బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి అంశాలు మా ప్రణాళికల్లో ఉన్నాయి' అని తెలిపారు.

ఇదీ చూడండి:ఆ మూడు డిమాండ్లతో.. పార్లమెంట్​కు కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details