తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో టీఎంసీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల దారుణ హత్య - టీఎంసీ కౌన్సిలర్ హత్య

West bengal news: బంగాల్​లో ఆదివారం ఇద్దరు కౌన్సిలర్లు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. ఉత్తర 24 పరగాణాలు జిల్లాలో టీఎంసీ, పురులియా జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్​ను దుండగులు తుపాకులతో కాల్చి చంపారు.

TMC, congress councillors shot dead in west bengal
టీఎంసీ, కాంగ్రెస్​ కౌన్సిలర్ల దారుణ హత్య

By

Published : Mar 14, 2022, 10:32 AM IST

TMC councillor shot dead: బంగాల్​లో అధికార టీఎంసీ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తర 24 పరగణాల జిల్లా పానీహాటీ మునిపాలిటీ 8వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనుపమ్​ దత్తాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతను ఆదివారం సాయంత్రం అగర్​పారా పార్కును సందర్శిస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

హత్యకు గురైన టీఎంసీ కౌన్సిలర్

Congress councillor shot dead

కాంగ్రెస్ కౌన్సిలర్​

బంగాల్ పురిలియా జిల్లాలోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఝల్దా మున్సిపాలిటీ రెండో వార్డు కాంగ్రెస్​ కౌన్సిలర్​ తపన్​ కాందును దండగులు కాల్చి చంపారు. బాధితుని తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రాంఛీలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

హత్యకు గురైన కాంగ్రెస్ కౌన్సిలర్​

ఇదీ చదవండి:దేశంలో రెండేళ్ల కనిష్ఠానికి కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details