తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నెగెటివ్‌ ఉంటేనే ఓట్ల లెక్కింపు హాళ్లోకి' - COVID protocols for counting agents

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 2న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పాటించాల్సిన నియమాలపై కేంద్ర ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నెగెటివ్ గా నిర్ధరణ అయిన వారికే.. ఓట్ల లెక్కింపు హాళ్లోకి ప్రవేశం ఉంటుందని పేర్కొంది.

Election Commission of India
ఎన్నికల సంఘం

By

Published : Apr 29, 2021, 12:24 AM IST

Updated : Apr 29, 2021, 6:47 AM IST

కరోనాను దృష్టిలో పెట్టుకొని మే 2న ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పాటించాల్సిన నియమాలపై బుధవారం.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నెగెటివ్‌ వచ్చిందన్న ధ్రువపత్రాలు ఉన్నవారికే ఓట్ల లెక్కింపు హాళ్లలోకి ప్రవేశం ఉంటుంది. అభ్యర్థులతో పాటు, వారి ఏజెంట్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి 48 గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకొని ఉండాలి. ఈ పరీక్షలు చేయించుకోని వారు అంతకుముందు రెండు డోసుల టీకాలనయినా వేసుకొని ఉండాలి.

  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద జనం గుమిగూడడానికి వీల్లేదు.
  • ఫలితాలు ప్రకటించిన అనంతరం విజయోత్సవాలు జరపకూడదు.
  • గెలిచినట్టు అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం స్వీకరించడానికి కూడా పరిమిత సంఖ్యలోనే వెళ్లాలి.
  • ఏజెంట్లు, అభ్యర్థులకు తగినన్ని పీపీఈ కిట్లు అందజేయాలి.
  • ముగ్గురు ఏజెంట్లు వరుసగా కూర్చొన్నప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి తప్పనిసరిగా పీపీఈ కిట్‌ను ధరించాలి.
  • ఉద్యోగులు, భద్రత సిబ్బంది అందిరికీ మాస్కులు, ఫేస్‌షీల్డులు, గ్లౌజ్‌లు, శానిటైజర్‌ను అందజేయాలి.
Last Updated : Apr 29, 2021, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details