బంగాల్ ఎన్నికల వేళ భాజపాను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా టీఎంసీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. అదే సమయంలో ఆయనను జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగానూ నియమించింది టీఎంసీ అధిష్ఠానం. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్రతా భక్షి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
టీఎంసీలో యశ్వంత్ సిన్హాకు కీలక పదవులు - యశ్వంత్ సిన్హా
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయన ఇటీవలే భాజపాను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.

టీఎంసీ ఉపాధ్యక్షనిగా యశ్వంత్ సిన్హా!
మొత్తం ఎనిమిది దశల్లో బంగాల్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న మొదటి దశ పోలింగ్ జరగనుంది.