మూఢనమ్మకాలతో కన్నబిడ్డపై చిత్రహింసలు తమిళనాడులో ఓ బాలుని అనుమానస్పద మృతిపై ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాలతో నిందితులు బాలున్ని చిత్రహింసలకు గురిచేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తిరువణ్ణామలైజిల్లా కన్నమంగళం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
దెయ్యం పట్టిందని..
తిలకవతి అనే మహిళ తన కుమారుడు శబరి(7)తో కలిసి వెల్లూరులో నివసించేది. తన కుమారునికి దెయ్యం పట్టిందని భావించి కన్నమంగళంలోని ఓ మాంత్రికుణ్ని సంప్రదించింది. తన సోదరిలతో కలిసి బాలున్ని తీసుకుని అక్కడకు వెళ్లింది. ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఈ క్రమంలో బాలునికి మూర్చ వచ్చింది. ఆ తర్వాత బాలుడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి వచ్చారు. చికిత్స అందించే బదులు తన తోబుట్టువులతో కలిసి బాలుణ్ని తీవ్రంగా కొట్టామని నిందితురాలు ఒప్పుకుంది.
ఇదీ చదవండి:దేవుడి పేరు చెప్పి బాలికకు తాళి కట్టిన పాస్టర్
సొంత కుటుంబాన్ని కడతేర్చి.. చివరకు తానూ..