TTD Latest and New Decisions on Pilgrims: తిరుపతి నుంచి తిరుమల నడకదారుల్లో అడవి జంతువులు దాడుల ఘటనల నేపథ్యంలో సమావేశమైన TTD ట్రస్ట్ బోర్డు ఈ కొత్త పథకానికి పచ్చజెండా ఊపింది. 12 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలిపిరి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తామని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. పెద్దలను రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామన్నారు. అలాగే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవిలతో కలిసి కరుణాకర్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు .
TTD Good News : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. డిసెంబర్ తర్వాత మరో లోకంలోకి భక్తులు!
ప్రస్తుతం తిరుమల వెళ్లే కాలి నడక భక్తులు భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్లు తీసుకుని గాలిగోపురం వద్ద స్కానింగ్ చేయించుకుని పైకి వెళ్తున్నారు. ఇకపై టోకెన్లు తీసుకున్న భక్తులు కాలినడకన లేదా ఇతర మార్గాల్లో అంటే వాహనాల్లో కూడా వెళ్లేందుకు అనుమితిస్తారు. పైగా గాలిగోపురం వద్ద తనిఖీ ఎత్తివేస్తున్నారు.
కాలినడక భక్తుల రక్షణకు ఎక్కువ సంఖ్యలో అటవీ సిబ్బందిని నియమించి, వారికి అవసరమైన రక్షణ పరికరాలు సమకూర్చుతారు. ఇందుకు అయ్యే ఖర్చును తిరుమల తిరుపతి దేవస్థానమే భర్తిస్తోందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. భక్తులను విడివిడిగా కాకుండా గుంపులుగా గంపులుగా కాలినడకన వెళ్లేందుకు అనమతిస్తారు. వారికి ముందూవెనుకా భద్రత సిబ్బంది ఉంటారు.
గతంలో నడకదారుల్లో కనిపించే వన్యప్రాణులకు ,సాధు జంతువులకు భక్తులు ఆహారాన్ని అందిచడానికి వీలు ఉండేది. ఇకపై వన్యప్రాణులకు ఆహారం పెట్టడాన్ని పూర్తిగా నిషేధించారు. జంతువులకు పెట్టే ఆహారాన్ని విక్రయించేవారిపైనా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దుకాణదారులు వ్యర్థాలు కూడా అడవిలో వదిలేస్తే జరిమానాతో పాటు చర్యలు తీసుకుంటారు.
వెంకన్న దర్శనం.. అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ప్రాణసంకటం..!