Tirumala Tirupati Devasthanam Recruitment 2023 : జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD).. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. మరి.. ఎన్ని పోస్టులు ఉన్నాయి..? ఎవరు అర్హులు..? విద్యార్హతలు ఏంటి..? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎవరు అర్హులు..? (Who is Eligible For TTD Jobs) : ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు.. ఈ ఉద్యోగాలకు అర్హులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు..? (How Many TTD Jobs) :తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్లో మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్) పోస్టులకు టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందులో OC-1, BC(A)-1, SC-1, EWS-1 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు ఏంటి..? (Education Qualifications For TTD Jobs):ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించిన విద్యార్హతలను కూడా నోటిఫికేషన్లో టీటీడీ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్(ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలని సూచించింది. దీంతోపాటు వయసు కూడా మెన్షన్ చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు.. 2023 జులై1 నాటికి 42 సంవత్సరాలు మించకూడదని స్పష్టం చేసింది. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది.
శ్రీవారు కరుణించినా "కరుణాకర్" కృప లేదు - అన్నప్రసాదంపై విమర్శల పర్వం
ఎలా ఎంపిక చేస్తారు..? (Selection Process For TTD Jobs): ఈ ఉద్యోగాలను వివిధ దశల్లో పూర్తి చేస్తారు. అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులు అయినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.