Last Date to Apply TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD)లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 ఇంజినీర్ల పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్‌కు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ 23, 2023. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
ఎవరు అర్హులు..?:ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే TTD ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు..?:తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్లో మొత్తం 56 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు 27 ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 10 ఉన్నాయి. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) పోస్టులు 19 ఉన్నాయి. అన్నీ కలిపి మొత్తం 56 పోస్టులకు టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?
విద్యార్హతలు ఏంటి..?ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించిన విద్యార్హతలను కూడా టీటీడీ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో పాటు వయసు కూడా మెన్షన్ చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించకూడదని స్పష్టం చేసింది.
ఫీజు ఎంత: టీటీడీ నోటిఫికేషన్ ప్రకారం.. అప్లికేషన్ ఫీజు OC వాళ్లకి 120 రూపాయలు కాగా.. మిగిలిన వారికి(SC, ST, BC, EWS,) ఫీజు లేదు.