కలియుగదైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడమే మహద్భాగ్యంగా భావిస్తుంటారు భక్తులు. ఇందుకోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దేశ, విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వస్తుంటారు. క్షణకాలం పాటు చేసుకునే ఆయన దర్శనం.. జన్మజన్మల భాగ్యంగా తలుస్తారు. అలాంటిది.. శ్రీవారి ఆశీర్వచనాలు కలిగిన వస్త్రాలను పొందే భాగ్యం లభిస్తే ఎలా ఉంటుంది..? అవును.. ఈ అవకాశాన్ని కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏడుకొండల వాడికి కానుకలుగా వచ్చిన వస్త్రాలను టెండర్ కమ్ వేలం వేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 29న ఈ వేలం జరగనుంది. మరి, ఎలాంటి వస్త్రాలను వేలం వేస్తున్నారు? అందులో ఏమేం ఉన్నాయి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
వేలం వేస్తున్నవి ఇవే..!
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను వేలం వేస్తున్నట్టుగ టీటీడీ స్వయంగా ప్రకటించింది. ఇందులో ఏమేం వస్త్రాలు ఉన్నాయో కూడా సవవివరంగా వెల్లడించింది. ఈ దుస్తుల్లో.. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న 14 లాట్‌లు ఉన్నాయట. ఇంకా వివరంగా చూస్తే.. కొత్త ఆర్ట్ సిల్క్ చీరలు, కొత్త ఆర్ట్ సిల్క్ ధోతీలు, అప్పర్స్, యూజ్డ్/డేమేజ్డ్ ధోతీలు, కొత్త పాలిస్టర్ / నైలాన్ / నైలెక్స్ చీరలు, కొత్త లుంగీలు, క్లాత్ బిట్స్, ఆర్డినరీ టవల్స్/అప్పర్స్, పాలిస్టర్ అప్పర్స్, టర్కీ టవల్స్, రెడీమేడ్స్, హుండీ గాలిబ్స్ ఉన్నాయట. ఇందుకు సంబంధించి వేలంలో పాల్గొనే భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటే.. తిరుపతిలోని TTD మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని.. 0877-2264429 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా సంప్రదించవచ్చు. లేదంటే.. TTD వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.inలో కూ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.
TTD Good News : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. డిసెంబర్ తర్వాత మరో లోకంలోకి భక్తులు!