ఒడిశాలో బీజేడీ శాసనసభ్యుడు బిజయ శంకర్ దాస్‌పై ఆయన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. 2022 మే17న జగత్సింగ్పుర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బిజయ, సోమాలిక తమ వివాహాన్ని నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. శుక్రవారం వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ ఇచ్చారు.
సోమాలిక దాస్ శుక్రవారం కార్యాలయానికి వచ్చి తిర్టోల్ ఎమ్మెల్యే బిజయ కోసం ఎదురు చూసింది. ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు ఎవరూ కార్యాలయానికి రాలేదు. దీంతో రెండు గంటలపాటు వారి కోసం నిరీక్షించి సోమాలిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వెళ్లిపోయింది.
"బిజయ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. తనకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఏం జరిగిందో కచ్చితంగా నాకు తెలియదు. బిజయను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు లేదా ఉద్దేశ్యపూర్వకంగా బిజయ నన్ను మోసం చేసి ఉండవచ్చు. అతనిపై కేసు పెడతాను. "