తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘనంగా 'తిరంగా బైక్​ ర్యాలీ'.. జెండా ఊపి ప్రారంభించిన వెంకయ్య

Tiranga Bike Rally: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 'తిరంగా బైక్ ర్యాలీ' నిర్వహించింది కేంద్ర సాంస్కృతిక శాఖ. ఎర్రకోట నుంచి పార్లమెంట్​ గేటు​ వరకు సాగిన ఈ బైక్​ ర్యాలీని జెండా ఊపి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

TIRANGA RALLY
TIRANGA RALLY

By

Published : Aug 3, 2022, 11:13 AM IST

Updated : Aug 3, 2022, 11:47 AM IST

ఘనంగా 'తిరంగా బైక్​ ర్యాలీ'.. జెండా ఊపి ప్రారంభించిన వెంకయ్య

Tiranga Bike Rally: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం తిరంగా బైక్​ ర్యాలీని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించింది. ఎర్రకోట నుంచి ఇండియా గేట్​ వరకు బైక్​ ర్యాలీ జరిగింది. ఎర్రకోట వద్ద బైక్​ర్యాలీని జెండా ఊపి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

జెండా ఊపి బైక్​ర్యాలీ ప్రారంభించిన వెంకయ్యనాయుడు
తిరంగా బైక్ ర్యాలీ
తిరంగా బైక్​ ర్యాలీ

Harghar Tiranga: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​'లో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్‌ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్​లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు పలు కార్యక్రమాలు చేయాలని సూచించారు.

తిరంగా బైక్ ర్యాలీ

Azadi ka Amrith Mahotsav: ఆగస్టు 11 నుంచి 13 వరకు మహాత్మా గాంధీకి ఇష్టమైన 'రఘుపతి రాఘవ రాజారామ్', 'వందేమాతరం' గీతాల్ని ఆలపించాలని నడ్డా తెలిపారు. మంగళవారం, దిల్లీలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.. తిరంగా బైక్ ర్యాలీ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని అన్నారు.

ఇవీ చదవండి:నేషనల్ హెరాల్డ్ కేసులో రెండోరోజూ ఈడీ సోదాలు.. ఉదయం 8 నుంచే..

బ్రిటిష్ నిష్క్రమణ వెనక అదృశ్య శక్తి.. అమెరికా!

Last Updated : Aug 3, 2022, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details