తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీపావళి టపాసులు - మీ పెంపుడు జంతువుల​ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Pets Care During Diwali 2023 : దీపావళి పండగ సమయంలో పెట్స్ కేర్ కచ్చితంగా తీసుకోవాలి. క్రాకర్స్, వాయు కాలుష్యం.. పెంపుడు జంతువులను బాగా ఇబ్బంది పెడతాయి. మరి, ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Pets_Care_During_Diwali_2023
Pets_Care_During_Diwali_2023

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 2:02 PM IST

Pets Care During Diwali 2023: చీకటిని పారద్రోలి.. వెలుగులు నింపే పండగ దీపావళి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటారు. మరి పెంపుడు జంతువుల విషయంలో కూడా అలాంటి శ్రద్ధే తీసుకోవాలి. దీపావళి సీజన్‌లో మీ పెంపుడు జంతువులను సురక్షితంగా, ప్రశాంతంగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పెంపుడు జంతువులు పెద్ద శబ్దాలకు భయపడతాయని మనకి తెలుసు. వారి భద్రతకు జాగ్రత్తలు తీసుకుని.. వాటితో పాటు మీరు కూడా పండగను ఎంజాయ్ చేయవచ్చు. ఈ దీపావళికి మీ పెంపుడు జంతువులను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు, ఆహారం ఇవ్వండి..:దీపావళి వేళ బాణసంచా కాల్చడంతో పర్యావరణం పొడిగా మారుతుంది. దీని ఫలితంగా పెంపుడు జంతువులకు దాహం ఎక్కువగా వేస్తుంది. అందుకే పెట్స్​కు ఇంటిలో ఒక సురక్షితమైన మూలలో నీరు, ఆహారాన్ని పెట్టండి.

దియాలు, లైట్లకు దూరంగా ఉండండి..:దియాలు, లైట్లు, విద్యుత్ కనెక్షన్‌లకు పెట్స్​ను దూరంగా ఉంచండి. అవి వెలుగుతున్నప్పుడు వాటిని లాగడానికి ప్రయత్నిస్తాయి. అందువల్ల వాటికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుబాటులో ఉండేలా లైట్లు, దియాలు పెట్టకండి.

దీపావళి స్పెషల్​ గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి!

స్వీట్లు దూరంగా ఉంచాలి:పండగల సమయంలో ఇళ్లలో ఎక్కువగా స్వీట్లు చేస్తారు. అయితే స్వీట్లు పెట్స్ ఆరోగ్యానికి హానికరం. అందువల్ల పెంపుడు జంతువులను స్వీట్లకు దూరంగా ఉంచండి. లేదంటే అవి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. వాటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్, సరైన పరిమాణంలో వాటికి ఇవ్వండి.

క్రాకర్లకు దూరంగా ఉంచండి:మీ పెంపుడు జంతువు దగ్గర టపాసుల పెట్టెలు ఉంచవద్దు. ఎందుకంటే వాటిలో ఏముందో అనే ఆతృతతో వాటిని లాగడానికి ప్రయత్నిస్తాయి. దీని వల్ల వాటి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

కాటన్​ యూజ్​ చేయండి:పెద్ద శబ్దాలు పెంపుడు జంతువులలో ఆందోళనలు కలిగిస్తాయి. ఆ సమయంలో వాటి చెవుల్లో దూది పెట్టడం వల్ల ఆ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం కలిగించవచ్చు. అయితే, కొన్ని కుక్కలు చెవుల్లో దూది పెట్టుకున్నా కూడా భయపడతాయి. అవి భయపడకుండా ఉండేందుకు.. వాటిని సౌండ్ ప్రూఫ్ గదిలో లేకుంటే అవి సౌకర్యవంతంగా ఉండే ప్రదేశాల్లో ఉంచాలి.

దీపావళిని ఐదు రోజుల పండగంటారు?-ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి!

ఫస్ట్​ ఎయిడ్​ బాక్స్​ రెడీగా పెట్టుకోవాలి:బాణాసంచా కాల్చే సమయంలో చాలా మంది ఫస్ట్​ ఎయిడ్​ బాక్స్​ను అందుబాటులో ఉంచుకుంటారు. ఆ విధానాన్నే మీ పెంపుడు జంతువుల విషయంలో పాటించండి. అనుకోకుండా మీ పెట్​కు ఏమైనా జరిగితే.. వాటి కోసం వెతకాల్సిన అవసరం ఉండదు.

కుక్కలపై క్రాకర్స్​ విసరొద్దు:బాణాసంచా కాల్చే సమయంలో చాలా మంది ఆకతాయిలు వీధి కుక్కలు, లేదా పెట్స్​పై క్రాకర్స్​ను విసిరేస్తారు. ఆ పని వల్ల వాటికి తీవ్ర గాయాలవుతాయి. ముఖ్యంగా వీధి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఉండడానికి ఇల్లు ఉండదు. కాబట్టి వాటి విషయంలో కాస్తా మానవత్వం పాటించాలి.

శుభ్రత పాటించండి:టపాసుల్లో ఉండే రసాయనాల వల్ల అవి బాగా ఇబ్బంది పడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంచండి. లేకుంటే అవి పెట్స్​కు దద్దుర్లు లేదా అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. వేడుకలు ముగిసిన వెంటనే పరిసరాలను శుభ్రం చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీరు పెట్స్​తో పాటు హ్యాపీగా దీపావళిని ఎంజాయ్ చేయవచ్చు.

దీపావళి ఎప్పుడు - 12నా? 13వ తేదీనా? పంచాంగం ఏం చెబుతోంది?

దీపావళి వేళ - మీ ఇంటి డెకరేషన్ కోసం సూపర్​ ఐడియాస్​!

దీపావళి గిఫ్ట్ - ఇలా ప్లాన్ చేస్తే అదుర్స్!

ABOUT THE AUTHOR

...view details