అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టైమ్ మ్యాగజైన్ ప్రత్యేక సంచిక విడుదల చేసింది. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫొటోతో ఉన్న ఈ సంచిక కవర్‌పేజీని ఆ పత్రిక నేడు ట్విట్టర్‌లో విడుదల చేసింది. 'నన్ను బెదిరించలేరు.. నన్ను కొనలేరు' అనే శీర్షికతో టైమ్ ఈ కథనం ప్రచురించింది.
లింగ వివక్షకు వ్యతిరేకంగా..
ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా.. ముందుండి నడిపిస్తున్న పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహిళా రైతుల అనుభవాలు, బాధలను ఈ కవర్‌స్టోరీలో రాసుకొచ్చింది. నూతన సాగు చట్టాలపై మాత్రమే కాకుండా.. పితృస్వామ్యం, స్త్రీహత్య, లైంగిక హింస, లింగ వివక్షకు వ్యతిరేకంగా ఈ మహిళలు పోరాటం సాగిస్తున్నారని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.