కాంగ్రెస్తో రాజీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని వస్తున్న వార్తలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(Amarinder Singh News) శుక్రవారం ఖండించారు. ఆ పార్టీతో సయోధ్యకు సమయం ముగిసిపోయిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాంగ్రెస్ను వీడాలని తాను తీసుకున్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. త్వరలోనే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని పునరుద్ఘాటించారు.
"కాంగ్రెస్తో తెరవెనుక చర్చలు జరుపుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవం. ఆ పార్టీతో సయోధ్యకు సమయం ముగిసిపోయింది. చాలా ఆలోచించిన తర్వాతే కాంగ్రెస్ను వీడాలని నిశ్చయించుకున్నాను. అదే ఇక చివరిది. నాకు మద్దతు అందించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ, ఇప్పుడు కాంగ్రెస్లో మాత్రం ఉండను."
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
తనను పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు... చర్చల జరుపుతున్నారని కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలపై అమరీందర్(Amarinder Singh News) ఈ మేరకు స్పందించారు.