గత కొన్ని నెలలుగా సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న దిల్లీలోని టిక్రీ సరిహద్దుల్లో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా కిసాన్ సోషల్ ఆర్మీతో సంబంధమున్న వ్యక్తులుగా తెలుస్తోంది.
టిక్రీ సరిహద్దులో రైతులకు మద్దతుగా ఆందోళన చేసేందుకు ఏప్రిల్ 10న బంగాల్ నుంచి ఓ మహిళ దిల్లీ బయలుదేరింది. ఆమెతో ఉన్న వ్యక్తి రైలులోనే ఆమెను వేధించాడు. ఆ తర్వాత టిక్రీ సరిహద్దుకు చేరుకోగా సామూహిక అత్యాచారం జరిగింది. ఏప్రిల్ 25న బాధితురాలు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏప్రిల్ 30న కరోనా లక్షణాతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చనిపోయిందని ఆమె తండ్రి తెలిపారు.